ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 14:46:20

న్యూ క్ల‌బ్ లోకి అడుగుపెట్టిన రాశీఖ‌న్నా

న్యూ క్ల‌బ్ లోకి అడుగుపెట్టిన రాశీఖ‌న్నా

సాధార‌ణంగా హీరోయిన్లు ఎక్కువ‌గా వారి సినీ కెరీర్ ను 16-20 మ‌ధ్య ఎక్కువ‌గా మొద‌లుపెడుతుంటారు. ఆ త‌ర్వాత 25 ఏండ్ల దాటే వ‌ర‌కూ ఫుల్ జోష్‌లో కెరీర్ న‌డుస్తుంది. అనంత‌రం మెల్ల‌మెల్ల‌గా ఆఫ‌ర్లు త‌గ్గిపోతుంటాయి. కానీ కొంత‌మంది హీరోయిన్లకు మాత్రం ఈ ఫార్ములాకు వ్య‌తిరేకం. మూడు ప‌దుల వ‌య‌స్సు దాటినా కుర్ర హీరోయిన్లకు తామేమి త‌క్కువ కాద‌ని గ‌ట్టిపోటీనే ఇస్తుంటారు. అలాంటి హీరోయిన్ల జాబితాలో ఉంటుంది రాశీఖ‌న్నా. తాజాగా ఈ భామ థ‌ర్టీ ఇయ‌ర్స్ క్ల‌బ్ లో చేరింది. నేటితో 30వ ప‌డిలోకి అడుగుపెడుతున్న రాశీఖ‌న్నాకు అభిమానులు, కోస్టార్లు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ క్ల‌బ్ లో అనుష్క‌, న‌య‌న‌తార‌, శ్రియ‌, కాజ‌ల్ చేరిపోయారు. కానీ వీరంతా స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొన‌సాగిస్తున్నారు. ఈ హీరోయిన్లంతా 30+ వ‌య‌స్సువారే. ఆరేండ‌ల్ క్రితం ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాశీఖ‌న్నా ఇపుడు కొత్త క్ల‌బ్ లో జాయిన్ అయిపోయింది. మిగితా హీరోయిన్ల‌కు రాశీఖ‌న్నా తేడా ఏంటంటే..ఈ భామ కెరీర్ లో ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేసుకుంటూ వ‌స్తోంది. మాధ్య‌మిక బ‌డ్జెట్‌లో తెర‌కెక్కించే సినిమాల నిర్మాత‌లు ఎక్కువ‌గా రాశీఖ‌న్నాను బెస్ట్ ఛాయిస్ గా ఎంచుకుంటుంటారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo