శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 19:01:39

డిస్కో కింగ్ బ‌ప్పీల‌హ‌రికి బ‌ర్త్ డే విషెస్‌..హిట్ సాంగ్స్

డిస్కో కింగ్ బ‌ప్పీల‌హ‌రికి బ‌ర్త్ డే విషెస్‌..హిట్ సాంగ్స్

బ‌ప్పీల‌హ‌రి..ఈ పేరు వింటే చాలు మ్యూజిక్ ల‌వ‌ర్స్ లో ఫుల్ జోష్‌ వ‌చ్చేస్తుంది. గాయ‌కుడిగా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా, డిస్కో మ్యూజిషియ‌న్ గా, రికార్డు ప్రొడ్యూస‌ర్ గా భార‌త సినీప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. తొలిసారి ఇండియన్ సినిమాస్ లో సింథ‌సైజ్‌డ్ డిస్కో మ్యూజిక్ ను ఉప‌యోగించి..అంద‌రిలో ఫుల్ జోష్ నింపాడు. అంద‌రూ ముద్దుగా డిస్కో కింగ్ అని పిలుచుకునే బ‌ప్పీల‌హ‌రి పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా సినీ, ప్రేక్ష‌కలోకమంతా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంది. బ‌ప్పీల‌హ‌రి కంపోజ్ చేసిన మ్యూజిక్‌, పాట‌లు ప్రేక్ష‌క‌లోకాన్ని మ‌రో ప్ర‌పంచానికి తీసుకెళ్తాన‌య‌డంలో ఎలాంటి సందేహం లేదు.

డిఫ‌రెంట్ స్వ‌త‌హాగా బెంగాలీ అయిన బ‌ప్పీ ల‌హ‌రి హిందీ, తెలుగులో చాలా సినిమాల్లో పాట‌ల‌కు ప్రాణం పోశారు. తెలుగులో సింహాస‌నం, గ్యాంగ్ లీడ‌ర్, బిగ్ బాస్‌, రౌడీ గారి పెళ్లాం వంటి సినిమాలతోపాటు మ‌రెన్నో సినిమాలకు పాట‌లు కంపోజ్ చేశారు. ఈ ఏడాది ర‌వితేజ్ హీరోగా న‌టించిన డిస్కో రాజా చిత్రంలో ర‌మ్ ప‌మ్ బమ్ పాట‌కు గొంతు క‌లిపారు బ‌ప్పీ ల‌హ‌రి.

బ‌ప్పిల‌హ‌రి పాట‌ల్లో కొన్ని..

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.