తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హను-మాన్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్‌నివ్వగా, జెమిని కిరణ్ కెమెరా స్విఛాన్ చేశారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ‘హనుమాన్ భారతీయులకు సూపర్‌హీరో. ఆయన అపూర్వ శక్తులు, పోరాటపటిమ అద్భుతంగా అనిపిస్తాయి. సూపర్‌హీరోస్ సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తాయి. అలాంటి అన్ని అంశాలు కలిసి ఉన్న చిత్రమిది. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ టీజర్‌కు మంచి స్పందన లభించింది. అత్యాధునిక వీఎఫ్ఎక్స్ సాంకేతికతతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్ విల్లే, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.