e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో చిత్రానికి టైటిల్ ఫిక్స్

ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో చిత్రానికి టైటిల్ ఫిక్స్

ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో చిత్రానికి టైటిల్ ఫిక్స్

క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ అ! సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కేలా వినూత్నంగా తెర‌కెక్కించాడు. ఇక రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌ల్కి అనే చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఇది కూడా కొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కులని అల‌రించింది. ఇటీవలె తేజ సజ్జాను హీరోగా పరిచయం చేశారు. జాంబీ రెడ్డితో తొలిసారిగా సౌత్‌లో జాంబీ జోనర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రశాంత్‌ వర్మ. ఈ చిత్రం వెండితెర‌పైనే కాక బుల్లితెర‌పై కూడా స‌త్తా చాటింది.

ఇక ఈ రోజు ప్ర‌శాంత్ వ‌ర్మ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న నాలుగో సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. హ‌నుమాన్ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, తెలుగులో ఇదే మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిలిం అని ప్రశాంత్ వర్మ టీమ్ ప్రకటించింది. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండ‌గా, ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్‌లో నేపథ్య సంగీతం దైవిక అనుభూతిని కలిగించింది. కథానాయకుడు సహా ప్రాజెక్ట్ తారాగణం ఇతర సిబ్బంది వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి..

విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్‌
మ‌హ‌మ్మారి అంతంపై డ‌బ్ల్యూహెచ్ఓ కీల‌క వ్యాఖ్య‌లు
29-05-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు
అధిక ఫీజు వ‌సూలు.. 64 ఆస్ప‌త్రుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్‌ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్‌ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్‌.. బెంగాల్‌ సీఎస్‌ కేంద్ర సర్వీసుల్లోకి..
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో చిత్రానికి టైటిల్ ఫిక్స్

ట్రెండింగ్‌

Advertisement