పాల బుగ్గల చిన్నది హన్సిక ఒకప్పుడు తన అంద చందాలతో ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశముదురు చిత్రంతో చిన్న వయస్సులోనే స్టార్డమ్ తెచ్చుకున్న ఈ ముంబై చిన్నది తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లలో ఫాలోవర్లను సంపాదించుకుందీ. కెరీర్ అంత సాఫీగా సాగకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నెటిజన్స్ ని అలరిస్తుంది.
బొద్దందాలతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన హన్సిక అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. తమిళనాట అయితే ఈమెకు ఏకంగా గడి కూడా కట్టేసారు అభిమానులు. అయితే ఈ అమ్మడు తాజాగా తనకు ఇడ్లీ అంటే ఇష్టమని చెప్పింది. ఇడ్లీ నా బ్రాండ్ టిఫిన్. నా చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ వేరే టిఫిన్ చేస్తే తినేదాన్ని కాదు. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా ‘ఇడ్లీ బుగ్గల పిల్లా’ అంటూ టీజ్ చేసేవారు. నా గ్లామర్ సీక్రెట్ కూడా ఇడ్లీ అయి ఉండవచ్చు. ఇప్పుడైతే అన్ని రకాల టిఫిన్స్ తింటున్నానంటుంది హన్సిక.