కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది హన్సిక. గత కొంతకాలంగా తన పంథాను మార్చిన ఆమె ప్రయోగాలవైపు అడుగులు వేస్తోంది. కొత్త కథల కోసం నిరీక్షిస్తూ రెండేళ్ల పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాల వేగాన్ని పెంచింది. తాజాగా ఓ తమిళ సినిమాలో ఆమె విజయ్ ఆంటోనీ జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్య కథాంశంతో రియలిస్టిక్‌గా సాగే ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో పల్లెటూరి యువతిగా డీ గ్లామర్ లుక్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో హన్సిక కనిపించబోతున్నట్లు సమాచారం. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆమె క్యారెక్టర్ సాగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’తో పాటు ‘105 మినిట్స్’ సినిమాల్లో హన్సిక కథానాయికగా నటిస్తోంది.