పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు (Deshamuduru) సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరిసింది ముంబై భామ హన్సికా మోత్వానీ (Hansika Motwani). కెరీర్ లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం మై నేమ్ సావిత్రి (My Name Is Shruthi) అంటూ తెలుగు సినిమా చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటుంది. విరామ సమయంలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ పెట్టుకుంది.
అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. కాజల్ అగర్వాల్ తో మీ స్నేహం గురించి చెప్పాలని ఓ అభిమాని అడిగారు. కాజల్ చాలా మంచి మనస్సున్న వ్యక్తి. మేమిద్దరం కలిసి మళ్లీ కాఫీ డేట్ కు వెళ్లాలి అని సమాధానమిచ్చింది. తొలి సినిమా కోస్టార్ అల్లు అర్జున్ పై మీ అభిప్రాయమేంటి అని మరో అభిమాని అడుగగా..నా మొదటి సహ నటుడు చాలా మంచి మనస్సు కలిగిన ఫన్నీయెస్ట్ పర్సన్ అని చెప్పింది. అంతేకాదు తాను ఎక్కువగా ఇష్టపడే హెయిర్ స్టైలిస్ట్ సవిత సంక్పాల్ అని తెలిపింది.
ఇక వెకేషన్ కు వెళ్లాల్సి వచ్చినపుడు హిల్ స్టేషన్ ను ఎంపిక చేసుకుంటారా..? లేదా బీచ్ లో ఛిల్ అవుట్ అవుతారా..? అభిమాని అడిగారు. దీనికి ఎప్పుడైనా బీచ్ అంటూ బదులిస్తూనే..తాను ప్రస్తుతం సోఫీ టక్కర్ సాంగ్ వింటున్నానని చెప్పింది. ఈ భామ తెలుగులో 105 మినిట్స్ అనే మరో సినిమా కూడా చేస్తోంది. హన్సిక 50వ సినిమా మహా (తమిళం) విడుదల కావాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర