బుధవారం 03 జూన్ 2020
Cinema - May 11, 2020 , 10:35:26

తండ్రికి విషెస్ అందించిన దిల్ రాజు కూతురు

తండ్రికి విషెస్ అందించిన దిల్ రాజు కూతురు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని ఫాంహౌజ్‌లో రెండో వివాహం చేసుకున్నారు. కొద్ది మంది స‌న్నిహితుల మ‌ధ్య నిరాడంబ‌రంగా ఆయ‌న వివాహం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఆదివారం ఉద‌యం నేను కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నా అంటూ దిల్‌రాజు  ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఆయన భార్య అనిత గుండెపోటుతో మరణించడంతో ఒంట‌రిగా ఉంటున్న దిల్ రాజు రీసెంట్‌గా రెండో వివాహం చేసుకున్నారు. 

కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా త‌న తండ్రికి శుభాకాంక్ష‌లు అందించింది కూతురు హ‌న్సిత రెడ్డి. డియ‌ర్ డాడ్..  నువ్వు నాకు అన్ని విష‌యాల్లో అండ‌గా నిలిచావు. మీ వ‌ల‌న అంద‌రం సంతోషంగా ఉన్నాం. మ‌న కుటుంబ సంతోషం కోసం మీరు ఎన్నో చేశారు. కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న మీకు శుభాకాంక్ష‌లు. మీరిద్ద‌రు సంతోషంగా ఉండాల‌ని, ప్ర‌తి రోజు అద్భుతంగా ఉండాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను అని హ‌న్సిత ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.ప్రస్తుతం దిల్‌రాజు ‘వీ’ ‘వకీల్‌సాబ్‌' చిత్రాల్ని నిర్మిస్తున్నారు.  ‘వీ’ సినిమా విడుదల కరోనా ప్రభావంతో వాయిదా పడింది.


logo