కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు అందరు తమకు చేతనంత సాయాలు చేసి ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ప్రజల వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్న సెలబ్స్ అడిగిన వారికి లేదనకుండా సాయాలు చేస్తున్నారు. తాజాగా షకీలా కరోనా కాలంలో సామాజిక సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. లాక్డౌన్ కారణంగా ఆకలితో రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రెండు చేతుల్లో ఒక చేతిని మీ కోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి, పేదలకు సాయం చేయండి అంటూ షకీలా పేర్కొంది.