సోమవారం 25 మే 2020
Cinema - Mar 03, 2020 , 14:38:37

పోలీసుల ఎదుట క‌మ‌ల్‌.. విచార‌ణ వేగ‌వంతం

పోలీసుల ఎదుట క‌మ‌ల్‌.. విచార‌ణ వేగ‌వంతం

భారతీయుడు 2 సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదం సినీ ల‌వ‌ర్స్‌ని ఎంత‌గా క‌ల‌చివేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  ఫిబ్రవరి 19,2020 రాత్రి ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఈ ఘటన జరిగింది.  షూటింగ్ లో భాగంగా భారీ క్రేన్ ఏర్పాటు చేయ‌గా, ఆ క్రేన్ ఒక్క‌సారిగా కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో యూనిట్‌కి సంబంధించి ముగ్గురు చ‌నిపోయారు. మ‌రో 9 మంది గాయాల‌పాల‌య్యారు. ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇటీవ‌ల చిత్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ని పిలిచి విచార‌ణ జ‌రిపిన చెన్నై పోలీసులు నేడు క‌మ‌ల్‌ని విచారించ‌నున్నారు. కొద్ది సేపటి క్రితం క‌మ‌ల్  ఎగ్మూర్‌లోని  పోలీస్ క‌మీష‌న‌ర్ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఆయ‌న‌ని పోలీసులు ప‌లు కోణాల‌లో విచారించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ప్ర‌మాద ఘ‌ట‌న‌లో  కృష్ణ(34). మరో వ్యక్తి ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60). శంకర్ పర్సనల్ అసిస్టెంట్ 28 ఏళ్ల మధు మృత్యువాత ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. 


logo