మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 22, 2020 , 09:06:39

టాప్ 5 కంటెస్టెంట్స్‌ని డిసైడ్ చేసిన హారిక అన్న‌య్య‌

టాప్ 5 కంటెస్టెంట్స్‌ని డిసైడ్ చేసిన హారిక అన్న‌య్య‌

బిగ్ బాస్ సీజ‌న్ 4లో శ‌నివారం ఎపిసోడ్ రంజుగా సాగింది. మ‌రో సారి ఇంటి స‌భ్యులు హౌజ్‌మేట్స్ ముందుకు రాగా, వారు చెప్పిన విష‌యాలు అంద‌రు అవాక్క‌య్యేలా చేశాయి. ఇక ఈ సీజ‌న్ మొత్తంలో ఈ వారంలోనే అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగార్జున ప్ర‌క‌టించ‌డంతో హౌజ్‌మేట్స్ ఎగిరి గంతులేశారు. ఎపిసోడ్ మొద‌ట్లో మోనాల్ ఒక్క‌తే కూర్చొని నువ్వు గేమ్ ఆడ‌డానికి వ‌చ్చావు, సెంటిమెంట్స్, రిలేష‌న్స్‌కు దూరంగా ఉండంటూ త‌న‌కు తాను ధైర్యం చెప్పుకుంది. అఖిల్‌, సోహైల్‌లు మైక్ మ‌రిచిపోయిన కార‌ణంగా హారిక వారిద్ద‌రికి పనిష్మెంట్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో కెప్టెన్ అయితే ఒక్కొక్క‌రికి కొమ్ములు వ‌స్తాయ‌ని అన్నాడు అఖిల్. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అవినాష్ గెలుపొంద‌డంతో అత‌నికి 10 కూల్ డ్రింక్ బాటిల్స్ గిఫ్ట్ గా వ‌చ్చాయి

ఇక నాగ్ ఎంట్రీతో హౌజ్ వాతావ‌ర‌ణం మారింది. గ‌త వారం ఇంట్లోకి హౌజ్‌మేట్స్ రాగా, శ‌నివారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి హౌజ్‌మేట్స్‌తో మాట్లాడే అవ‌కాశాన్ని క‌ల్పించాడు నాగ్. అందుకు గాను తాను అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వాల‌ని అన్నాడు. ముందుగా హారికకు ఆ బంప‌ర్ ఆఫ‌ర్ రాగా, నువ్వు టాప్ 2లో ఉంటే ఎవ‌రు నీతో పాటు ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌వు అని నాగ్ ప్ర‌శ్నించారు. అందుకు ఆమె అవినాష్ పేరు చెప్పి అందుకు గ‌ల కార‌ణం కూడా వివరించింది.

హారిక ఆన్స‌ర్ స‌రైన‌ద‌ని భావించిన నాగ్ స్టేజ్‌పైకి హారిక అన్న‌య్య‌, స్నేహితుడిని ఆహ్వానించారు. వారు టాప్ 5 లో ఎవ‌రుంటార‌నే విష‌యం చెప్పారు.  హారిక‌, అభిజిత్‌, లాస్య‌, సోహైల్‌, అరియానా ముందు వరుసలో ఉంటార‌ని తెలిపారు.  అయితే హౌజ్‌లోకి త‌న త‌ల్లి  వ‌చ్చిన స‌మ‌యంలో ఏదో దెబ్బ త‌గిలింద‌ని, ఇది దాచి పెడుతున్నారని హారిక బాధ‌ప‌డింది. అయితే అమ్మ‌కు ఏం కాలేదు. సోఫా త‌గిలింది. చూసుకోవ‌డానికి నేనున్నాను క‌దా జాగ్ర‌త్త‌గా గేమ్ ఆడు అంటూ హారిక అన్న‌య్య చెప్పి నిష్క్ర‌మించాడు


logo