జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar)..సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రభాస్ నటించిన డార్లింగ్, కార్తీ యుగానికి ఒక్కడు చిత్రాలకు జీవీ అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. 2008లో ఉల్లాసంగా ఉత్సాహంగా, రజినీకాంత్ కథానాయకుడు చిత్రాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ నాని హీరోగా నటించిన జెండాపై కపిరాజు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు.
మళ్లీ చాలా కాలం తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ టాలీవుడ్ (Tollywood)కు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఓ ప్రాజెక్టుకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దీంతోపాటు తెలుగులో మరో పెద్ద సినిమాకు కూడా జీవీ ప్రకాశ్ పనిచేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. జీవీ ప్రకాశ్ కుమార్ చేస్తున్న సినిమాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
శశి దర్శకత్వంలో సిద్దార్థ్ నటించిన ఒరేయ్ బామ్మర్ది చిత్రంతో ఇటీవలే సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు జీవీ ప్రకాశ్ కుమార్. ప్రస్తుతం యువ సంగీత దర్శకుడు 6 కు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు.
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!