స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల పెళ్లి ఘనంగా జరిగింది. తమిళ నటుడు విష్ణువిశాల్ తో ఏడుగులు వేసింది. శుక్రవారం వీరి పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. కొద్దిమంది బంధుమిత్రులు, సెలబ్రిటీలు మాత్రమే ఈపెళ్లికి హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించారు. కొద్దిరోజుల క్రితమే విష్ణువిశాల్ ,గుత్తాజ్వాల అధికారికంగా తమ పెళ్లి తేదీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.