గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 10:45:54

ఆకట్టుకున్న గుంజ‌న్ సక్సేనా ట్రైల‌ర్‌‌

ఆకట్టుకున్న గుంజ‌న్ సక్సేనా ట్రైల‌ర్‌‌

భారత దేశపు తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌, కార్గిల్‌ గాళ్‌గా ఖ్యాతికెక్కిన గుంజన్‌ సక్సేనా జీవిత నేప‌థ్యంలో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.  శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించిన  ‘గుంజన్‌ సక్సేనా..ద కార్గిల్‌ గర్ల్‌' చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతుంది.  శరణ్‌శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే టీజర్‌ విడుదల కాగా, ఇది గుంజనా సక్సేనాని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.  తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఇందులో స‌న్నివేశాలు ప్రేక్షకుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. కార్గిల్‌ యుద్ధ సమయంలో గుంజన్  చీతా హెలికాప్టర్‌లో సైనికులతో పాటు ఆహారం, ఔషధాలను తరలించడం,  కీలక సమయాల్లో సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తించడం వంటి స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. గుంజ‌న్ చేసిన సేవ‌ల‌కి గాను ఆమె శౌర్యచక్ర పురస్కారం లభించింది.  కాగా, ఆగ‌స్ట్ 12న గుంజ‌న్ స‌క్సేనా చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో రిలీజ్ చేయబోతున్నారు.   ఈ సినిమాలో జాన్వీతో పాటు అంగద్‌ బేడీ, మానవ్‌ విజ్‌, పంకజ్‌ త్రిపాఠి, రజత్‌ బర్మేచా, నీనా గుప్తా, విజయ్‌ వర్మలు కూడా నటిస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo