శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 14:57:22

జాన్వీ క‌పూర్ చిత్రానికి పెరిగిన నెగెటివిటీ..!

జాన్వీ క‌పూర్ చిత్రానికి పెరిగిన నెగెటివిటీ..!

ద‌ఢ‌ఖ్ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ మ‌రి కొద్ది రోజుల‌లో గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. భారతదేశపు మొదటి మహిళా పైలట్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదల  చేయ‌నున్నారు. రిలీజ్‌కి మ‌రి కొద్ది రోజులే ఉండ‌డంతో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌లో ద‌ర్శ‌కుడు చూపించిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ అనే చిత్రం దేశ భ‌క్తి నేప‌థ్యంలో రూపొందుతుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ట్రైల‌ర్ అంచ‌నాలు మ‌రింత పెంచింది. అయితే ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ నిర్మాత కావ‌డంతో మూవీకి నెగెటివ్ ప‌బ్లిసిటీ చేస్తున్నారు.  యూట్యూబ్ లో ట్రైల‌ర్‌కి లైక్స్ తో పాటు డిస్ లైక్స్ కూడా అదే రేంజ్‌లో కొడుతున్నారు. సుశాంత్ మ‌ర‌ణానికి క‌ర‌ణ్ జోహార్ కూడా ఓ కార‌ణ‌మంటూ ఇటీవ‌ల విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న నిర్మించిన సినిమాల‌ని న‌ష్టాల బాట‌లో ప‌డేయాల‌ని సుశాంత్ అభిమానులు కంక‌ణం క‌ట్టుకు

న్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో గుంజ‌న్ స‌క్సేనా చిత్రానికి నెగెటివ్ ప‌బ్లిసిటీ చేస్తున్నారు.


logo