శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 14:59:00

సాయంత్రం స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌న్న గుణ‌శేఖ‌ర్

సాయంత్రం స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌న్న గుణ‌శేఖ‌ర్

క‌ళ్ళు చెదిరే సెట్స్ మ‌ధ్య అద్భుత‌మైన సినిమాలు చేస్తున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కొద్ది రోజుల క్రితం హిర‌ణ్య‌క‌శ్య‌ప్ అనే ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.   మైథలాజిక‌ల్ డ్రామాగా భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టిన‌ట్టు స‌మాచారం. యూఎస్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులన్నింటినీ పూర్తి చేయ‌గా, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో పాటు ఫాక్స్ స్టార్ స్టూడియ‌స్ అనే హాలీవుడ్ సంస్థ కూడా నిర్మిస్తుంద‌ట‌. రానా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ చిత్ర షూటింగ్ అతి త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌నే ఆలోచ‌న‌లో అభిమానులు ఉండ‌గా, గుణ‌శేఖ‌ర్ పెద్ద షాక్ ఇచ్చారు.

గుణ‌శేఖ‌ర్ కొద్ది సేప‌టి క్రితం త‌న ట్విట్ట‌ర్ ద్వారా.. కోవిడ్ స‌మ‌యంలోనే హిర‌ణ్య‌క‌శ్య‌ప్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసాం. అయితే ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లే కంటే ముందే మ‌రో సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నాను. ఆ వివ‌రాలు ఈ రోజు సాయంత్రం 7.11ని.ల‌కు ప్ర‌క‌టించ‌నున్నాం అని తెలిపారు. గుణ‌శేఖ‌ర్ స్టేట్‌మెంట్‌ని బ‌ట్టి చూస్తుంటే హిర‌ణ్య‌క‌శ్య‌ప్ చిత్రం మ‌రి కొన్నాళ్ళు వాయిదా పడుతుందేమో అనిపిస్తుందంటూ నెటిజ‌న్స్ చ‌ర్చించుకుంటున్నారు.