చిన్న సినిమాలకు, హీరోలకు స్టార్లు అండగా ఉండటం తెలిసిందే. ఇప్పడలానే కుర్రహీరో సందీప్ కిషన్ కి మద్దతుగా నిలుస్తున్నాడు విజయ్ దేవరకొండ. నాగేశ్వర రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న గల్లీ రౌడీ టీజర్ ని రౌడీ హీరో విడుదల చేయబోతున్నాడు. ఈనెల 19న సాయంత్రం 5గంటలకు ఈ టీజర్ రిలీజ్ కానుంది.
నేహా హరిరాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమాలో సింహా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఎంవీవీ సినిమా, కోనాఫిలిం కార్పోరేషన్ లో నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈసినిమా మే 13న ప్రేక్షకుల ముందుకురాబోతోంది.