శనివారం 06 జూన్ 2020
Cinema - May 23, 2020 , 08:43:01

అంచ‌నాలు పెంచిన గులాబో సితాబో ట్రైల‌ర్

అంచ‌నాలు పెంచిన గులాబో సితాబో ట్రైల‌ర్

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, యువ హీరో ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన చిత్రం 'గులాబో సితాబో'. రోనీ లాహిరి - షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ సర్కార్ దర్శకత్వం వహించారు. చిత్రాన్ని డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 12న విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

రెండు నిమిషాల 40 సెకండ్ల ట్రైల‌ర్‌ని ఆద్యంతం ఆస‌క్తి గా చూపించారు. రెండు వంశాల‌కి చెందిన క‌థ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుండ‌గా,  చాలా వరకు సినిమా అంతా లక్నో ప్రాంతంపు నేపథ్యంలోనే ఉండనుందని సమాచారం. ఆయుష్మాన్‌ - అమితాబ్‌లు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. ఇందులో అమితాబ్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచిదని చెప్ప‌వ‌చ్చు. logo