శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 20:54:19

ఎన్టీఆర్‌, చర‌ణ్ ను ప‌రిచ‌యం చేసే స్టార్ హీరో ఇత‌డే..!

ఎన్టీఆర్‌, చర‌ణ్ ను ప‌రిచ‌యం చేసే స్టార్ హీరో ఇత‌డే..!

ఎన్టీఆర్‌-రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ష‌న్ లో భారీ బ‌డ్జెట్ తో వ‌స్తోన్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది. శ్రియ‌, అజ‌య్ దేవ్‌గ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగు, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే థియేటర్ లో ఆర్ఆర్ఆర్  మొద‌ల‌య్యే ముందు పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచే స్టార్ హీరో ఎవ‌రనే వార్త ఇపుడు సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తాజా స‌మాచారం హిందీ వెర్ష‌న్ లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ పాత్ర‌ల‌ను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ ఇంట్ర‌డ్యూస్ చేస్తాడ‌ట‌. అమీర్‌కు వీరాభిమాని అయిన రాజ‌మౌళి ఇటీవలే క‌లిసి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వాల‌‌ని అడుగగా..అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్‌. మ‌రి తెలుగులో ఏ స్టార్ హీరో వాయిస్ ఓవ‌ర్ ఇస్తాడో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.