గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 19:44:37

లాక్ డౌన్ టైంలో షారుక్ ఖాన్ ఏం చేశాడంటే..?

 లాక్ డౌన్ టైంలో షారుక్ ఖాన్ ఏం చేశాడంటే..?

షారుక్ ఖాన్‌...లాక్ డౌన్ కాలంలో సోషల్ మీడియాలో అభిమానుల‌తో చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు ట‌చ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే షారుక్‌ఖాన్ మాత్రం లాక్ డౌన్ లో ఫ్యాన్స్ తో యాక్టివ్ గా లేర‌నే చెప్పాలి. బాలీవుడ్ బాద్ షా సినిమా వ‌చ్చి రెండేళ్ల‌వుతుంది. త‌న కొత్త సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు షారుక్‌. మ‌రి సినిమాలు లేవు. అభిమానుల‌తో ట‌చ్ లో లేడు. ఇంత‌కీ లాక్ డౌన్ పీరియ‌డ్ లో షారుక్ ఏం చేసుంటాడ‌ని, అభిమానులు చ‌ర్చించుకుంటున్నాడు. అయితే షారుక్ ఇన్నాళ్లు ఏం చేశాడ‌నే దానిపై..షారుక్ భార్య గౌరీఖాన్ క్లారిటీ ఇచ్చింది.

ఓ ఇంట‌ర్వ్యూలో గౌరీ ఖాన్ మాట్లాడుతూ..లాక్ డౌన్ స‌మ‌యాన్ని కుటుంబానికే కేటాయించాడు షారుక్‌. రోజూ మా కోసం కొత్త కొత్త వంట‌కాలు చేసి రుచి చూపించాడు. త‌న వంట అంటే షారుక్ కు చాలా ఇష్టం. కొన్ని నెల‌లుగా షారుక్ ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాలు చేశాడు. మా పిల్ల‌లు ఆ వంట‌కాలు ఆర‌గించి చాలా బాగా ఎంజాయ్ చేశార‌ని చెప్పుకొచ్చింది. త‌మ అభిమాన హీరో లాక్ డౌన్ కాలాన్ని త‌న‌కిష్ట‌మైన వంటకాలు చేయ‌డం ఉప‌యోగించుకున్నాడ‌ని తెలుసుకున్నారు ఫ్యాన్స్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo