మంగళవారం 09 మార్చి 2021
Cinema - Dec 24, 2020 , 16:50:26

రామ్ చేతిలో ఏం ప‌ట్టుకెళ్తున్నాడో చూడండి..వీడియో

రామ్ చేతిలో ఏం ప‌ట్టుకెళ్తున్నాడో చూడండి..వీడియో

టాలీవుడ్ లో వివాదాల‌కు దూరంగా ఉండి అభిమానుల‌కు మంచి సినిమాలందించే ల‌క్ష్యంతో ముందుకెళ్లే న‌టుల్లో ముందువ‌రుస‌లో ఉంటాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టిన ఈ న‌టుడు ఇటీవ‌లే కాలంలో సోష‌ల్ మీడియా ద్వారా కొత్త కొత్త స్టిల్స్ ను ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంటున్నాడు.త‌న టైం టేబుల్ లో జిమ్ కోసం ప్ర‌త్యేకించి టైం కేటాయించుకునే రామ్‌..ఇటీవ‌లే క‌ల‌ర్‌ఫుల్ జిమ్ టూల్ ఒక‌టి చేతిలో ప‌ట్టుకుని క‌నిపించాడు. వైట్ షార్ట్‌, టీషర్ట్ వేసుకున్న రామ్ జిమ్ టూల్ ను ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌స్తుండగా తీసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇంత‌కీ ఆ జిమ్ టూల్ ఏంటనే క‌దా మీ డౌటు. 9-1 బాడీ బిల్డింగ్ పుష్ అప్ ర్యాక్ బోర్డు. ఈ జిమ్ టూల్‌ శ‌రీరానికి సంపూర్ణ‌మైన వ్యాయామాన్ని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్‌ఫెక్ట్ వ‌ర్క‌వుట్స్ చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తుంది. రామ్ జిమ్ కు ఇలా ప‌ర్స‌న‌ల్ గా టూల్ ను తీసుకెళ్తూ వర్క‌వుట్స్ చేస్తూ బాడీ బిల్డ‌ప్ చేసుకుంటున్నాడ‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం కిశోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ లో రెడ్ సినిమా చేస్తున్నాడు రామ్‌.

ఇవి కూడా చ‌ద‌వండి

నాగ‌చైత‌న్య భీష్మాస‌నం ఎలా వేశాడో చూడండి

కామెడీ క్లబ్ నుంచి బ‌య‌టికొస్తున్న సునీల్‌..!

జ‌గ‌ప‌తిబాబు చిత్రానికి స‌రికొత్త టైటిల్‌

ఏసీల్లో కూర్చుని ట్వీట్లు చేసే నేత‌ను కాను..

అభిజీత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన సోహైల్‌

2020లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సెల‌బ్రిటీలు వీళ్ళే..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo