శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 20:36:02

గౌత‌మ్ కు కాజ‌ల్ ఏం కండిష‌న్ పెట్టిందంటే..?

గౌత‌మ్ కు కాజ‌ల్ ఏం కండిష‌న్ పెట్టిందంటే..?

ఏంటి.. గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోడానికి కాజల్ అగర్వాల్ కండీషన్స్ పెట్టిందా..? దానికి ఓకే అంటేనే పెళ్లి చేసుకుందా..? ఏంటా కండీషన్.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసుకుంటాననా లేదంటే నటనకు అడ్డు చెప్పకూడదనా..? ఇంతకీ ఏంటా కండీషన్ అనుకుంటున్నారా..? కాజల్ పెళ్లికి ముందు జరిగిన విషయాల గురించి ఇప్పుడిప్పుడే అసలు నిజాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఈ దంపతులు ఇద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒకరికి సంబంధించిన విషయాలు మరొకరు చెప్పుకున్నారు. ముఖ్యంగా కాజల్ ను ముందు ఎక్కడ కలిసాడు.. ఎప్పుడు డేట్ కు తీసుకెళ్లాడనే విషయాలపై కూడా గౌతమ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు తనకు గౌతమ్ ఎలా ప్రపోజ్ చేసాడు.. ఇంట్లో పెళ్లి విషయం ఎప్పుడు మాట్లాడాడనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ముందుగానే ప్రకటించింది కాజల్. 

తన కెరీర్ ఇప్పట్లో ఆపదలుచుకోలేదని.. కొనసాగుతూనే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది చందమామ. ఈ క్రమంలోనే డిసెంబర్ 5 నుంచి చిరంజీవి ఆచార్య షూటింగ్‌లో కూడా అడుగు పెట్టనుంది కాజల్ అగర్వాల్. మరోవైపు కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గౌతమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. పెళ్లికి ముందు తాను పెట్టిన కండీషన్ గురించి కూడా ఓపెన్ అయిపోయింది. తనను పెళ్లి చేసుకోవాలంటే మోకాలిపై వంగి ప్రపోజ్‌ చేయాలని కండీషన్ పెట్టిందని..అలా చేస్తే కానీ పెళ్లి చేసుకోనని ముందుగానే చెప్పానని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. 

దీనిపై గౌతమ్ స్పందిస్తూ.. కాజల్ దీని గురించి చెప్పినపుడు కాస్త ఓవర్‌ అనిపించినా కూడా సినిమాల నుంచి వచ్చింది కాబట్టి ఆ ఫాంటసీ ఉంటుందని అర్థం చేసుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు కచ్చితంగా అలా చేస్తే కానీ పెళ్లి చేసుకోనని కండీషన్ పెట్టడంతో చేసానని సరదాగా నవ్వుకుంటూ చెప్పాడు గౌతమ్ కిచ్లు. గౌతమ్‌కు సినిమాలు చూడటం నచ్చదని.. తాను బలవంతంగా స్క్రీన్ ముందు కూర్చోబెడతానని క్లారిటీ ఇచ్చింది చందమామ. కాజల్ తనకు తొలిసారి ముంబయిలోని ఎన్సీపీఏ కేఫ్‌లో ఎక్కువగా క్లోజ్ అయిందని..  ఆ తర్వాత అక్కడ లంచ్‌ చేశామని గుర్తు చేసుకున్నాడు గౌతమ్. తమ మధ్య సంభాషణ ఓ ఇంటర్వ్యూలా సాగిందని చెప్పుకొచ్చింది కాజల్. ఏదేమైనా కూడా మోకాలిపై వంగి ప్రపోజ్ చేస్తే తప్ప పెళ్లి చేసుకోనని చెప్పిన కాజల్ ఫాంటసీ మాత్రం అమ్మాయిలకు తెగ నచ్చేస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.