ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 23:39:47

దేవుడా? దయ్యమా?

దేవుడా? దయ్యమా?

ఆనంద్‌కృష్ణ, అశోక్‌, స్వాతి మండల్‌ నాయకానాయికలుగా నటిస్తున్న ‘జీఎస్‌టీ’(గాడ్‌ సైతాన్‌ టెక్నాలజీ). కొమారి జానకీరామ్‌ దర్శకుడు. కొమారి జానయ్యనాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర లోగో పోస్టర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘దేవుడు, దయ్యం సైన్స్‌లలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయాయి. ఆ అన్వేషణ నుంచి ఉద్భవించిన చిత్రమిది. దర్శకుడిగా నా తొలి ప్రయత్నమిది’ అని పేర్కొన్నారు. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వినూత్నమైన అనుభూతిని పంచుతుందని అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ సినిమాలో తాను తెలంగాణ యాసతో మాట్లాడే అమ్మాయిగా కనిపిస్తానని పూజ చెప్పింది. ఈ సినిమాకు కథే హీరోనని అశోక్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందు తదితరులు పాల్గొన్నారు. 


logo