శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 02:17:06

క్యాస్టింగ్‌కౌచ్‌తో స్టార్స్‌గా ఎదిగా : ఇషాకొప్పికర్‌

క్యాస్టింగ్‌కౌచ్‌తో స్టార్స్‌గా ఎదిగా : ఇషాకొప్పికర్‌

సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ప్రభావం ఎక్కువేనని అంటోంది సీనియర్‌ కథానాయిక ఇషాకొప్పికర్‌. దీనివల్లే  కొందరు కథానాయికలు కెరీర్‌లో అగ్రస్థానాలకు చేరుకున్నారని తెలిపింది.  తెలుగులో ‘చంద్రలేఖ’, ‘ప్రేమతో రా’ వంటి సినిమాల్లో నటించింది ఇషాకొప్పికర్‌. బాలీవుడ్‌లోని బంధుప్రీతి, కాస్టింగ్‌కౌచ్‌ సమస్యలపై ఆమె మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలోని బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వల్ల  స్వీయప్రతిభతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఔట్‌సైడర్స్‌ చాలా మంది నష్టపోతున్నారు.  సరైన ప్రతిభ లేకపోయినా స్టార్‌కిడ్స్‌ ఎన్నో అవకాశాల్ని పొందుతున్నారు.  బాలీవుడ్‌లో చాలా  క్యాంపులున్నాయి.  తమకు నచ్చిన వ్యక్తులు, మాట వినే వారితోనే వారంతా సినిమాలు చేస్తుంటారు. కాస్టింగ్‌ కౌచ్‌ ప్రభావం చాలానే ఉంది. కొందరు నాయికలు అవకాశాల్ని దక్కించుకోవడానికి దానిని ఓ సాధనంలా వాడుకున్నారు. కాస్టింగ్‌ కౌచ్‌కు అంగీకరించాలా? లేదా అన్నది వ్యక్తిగత అభిప్రాయం. ఆ ఛాయిస్‌ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి విషసంస్కృతికి నేను వ్యతిరేకంగా ఉన్నందువల్లే కెరీర్‌లో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నా. కష్టపడితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అసాధ్యమేమీ కాదు. మాధురీ దీక్షిత్‌, ప్రియాంకచోప్రా వంటి ఎందరో నాయికలు దానిని రుజువు చేశారు’ అని తెలిపింది.