శనివారం 26 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 14:56:07

వీళ్ళు పిల్ల‌లు కాదు పిడుగులు.. దింపేశారంతే!

వీళ్ళు పిల్ల‌లు కాదు పిడుగులు.. దింపేశారంతే!

ఒక్క‌రికి కూడా ప‌ట్టుమ‌ని ప‌దిహేను సంవ‌త్స‌రాలు కూడా ఉండ‌వు, కాని వాళ్ల ప‌ర్‌ఫార్మెన్స్ మాత్రం ఆస్కార్ రేంజ్‌లో ఉందంటే అతిశ‌యోక్తి కాదు. డైలాగ్స్‌కి త‌గ్గ‌ట్టు హావభావాలు, యాక్ష‌న్ సీన్స్‌లో అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్‌, ఒరిజిన‌ల్ సినిమాని త‌ల‌పించేలా కెమెరా పనితనం, అన్నింటికి తోడు డైరెక్ష‌న్.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసి స‌రిలేరు నీకెవ్వ‌రు ఇంట‌ర్వెల్ ఫైట్ సీన్‌ని క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడేలా చేశాయి. ఆరు నిమిషాల పాటు సాగిన ఈ వీడియో చిత్ర‌ ద‌ర్శ‌కుడిని కూడా ఫిదా చేసిందంటే వాళ్ల ప‌ర్‌ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు సూప‌ర్ స్టార్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో కొండా రెడ్డి బురుజు దగ్గ‌ర జ‌రిగిన‌ ఫైటింగ్ సీన్‌ని వాళ్ల స్టైల్‌లో షూట్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో ప్ర‌తి ఒక్క సీన్ ఆక‌ట్టుకునేలా ఉంది. మ‌హేష్ కూడా ఈ వీడియోకి ఫిదా అవుతాడ‌నంలో ఆశ్చ‌ర్యం లేదు. మీరు ఈ వీడియో చూసి ఆనందించండి. 


logo