శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 08:07:16

ప‌వ‌న్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన గ‌వ‌ర్న‌ర్

ప‌వ‌న్‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన గ‌వ‌ర్న‌ర్

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని,జీవితంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను అని త‌మిళిసై త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా  9.09ని.ల‌కి వ‌కీల్ సాబ్ నుండి స‌ర్‌ప్రైజ్ రానుంది. అలానే ప‌వ‌న్ 27 వ సినిమా అప్‌డేట్ మ‌ధ్యాహ్నాం 12.30ని.ల‌కి,  అలానే పవన్ కళ్యాణ్   28వ చిత్రం అప్ డేట్  సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రానుంది.