గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 20, 2021 , 13:17:42

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి మాస్‌మహారాజా ర‌వితేజ‌తో సినిమా చేయాల‌ని భావించిన విష‌యం తెలిసిందే. అయితే ర‌వితేజ‌తో ప్లాన్ వ‌ర్క‌వుట్ కాక‌పోలేదు. అంతా సెట్ట‌యితే ర‌వితేజ‌కు జోడీగా రాశీఖ‌న్నాను హీరోయిన్ గా తీసుకోవాల‌ని మారుతి ఫిక్స‌య్యాడు. అయితే ఆ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. కానీ ఈ ప్రాజెక్టును గోపీచంద్ తో క‌లిసి చేస్తున్నాడు మారుతి. ఈ చిత్రంలో రాశీఖ‌న్నాను హీరోయిన్ గా సెలెక్ట్ చేయాల‌ని ఫిక్స్ కాగా..గోపీచంద్ మాత్రం రాశీఖ‌న్నాతో చేయడానికి సిద్దంగా లేడ‌ట‌.

ఇప్ప‌టికే గోపీచంద్‌-రాశీఖ‌న్నాకాంబోలో జిల్‌, ఆక్సిజ‌న్ చిత్రాలు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచాయి. మ‌రోవైపు రాశీఖ‌న్నా శ్రీనివాస క‌ల్యాణం, అయోగ్య‌, వెంకీమామ‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ చిత్రాల్లో న‌టించినా..వెంకీ మామ సినిమా మిన‌హా మిగిలిన చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాశీఖ‌న్నాను ఎంపిక చేయ‌డం స‌రైంది కాద‌ని, అందుకే గోపీచంద్ ఆమెతో న‌టించ‌డానికి నోచెప్పాడ‌ని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

దీంతో మేక‌ర్స్ మ‌రో హీరోయిన్ ను వెతికే పనిలో ప‌డిన‌ట్టు టాక్.  రాశీఖ‌న్నా ప్ర‌స్తుతం త‌మిళంలో తుగ్ల‌క్ ద‌ర్బార్‌, అర‌ణ్మ‌నై 3, మేథావి చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. 

VIDEOS

logo