గురువారం 28 మే 2020
Cinema - May 15, 2020 , 12:08:24

స‌హ‌జీవ‌నం పై స్పందించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు

స‌హ‌జీవ‌నం పై స్పందించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు

మ‌ల‌యాళంలో పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన గోపి సుంద‌ర్‌కి ఆయ‌న భార్య ప్రియ‌తో ఎప్ప‌టి నుండో గొడ‌వలు ఉన్నాయి. ఇటీవ‌లి కాలంలో వారిరివురు విడాకులు కూడా అప్లై చేశారు. అయితే విడాకుల కేసు కోర్టులో ఉన్న స‌మ‌యంలో తాను కొన్నాళ్లుగా ప్రముఖ గాయని అభయ హిరణ్మయితో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు.

గ‌తంలో అభ‌య ..గోపి సుంద‌ర్‌తో రిలేష‌న్ షిప్‌పై స్పందిస్తూ.. తొమ్మిదేళ్లుగా మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం.  నేను పెళ్ళైన వ్యక్తితో సహజీవనం చేస్తున్నా.  2008 నుంచి కలసి జీవిస్తున్నాం. నాకింకా పెళ్లి కాలేదు. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 12 ఏళ్ళు ఉంది. ఆయన చాలా పెద్ద శరీరం కలిగిన మనిషి. ఆయన ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తాను. ఇలా చాలా విషయాల్లో మామధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ మేమిద్దరం కలసి సంతోషంగా జీవిస్తున్నాం అని అభయ హిరణ్య తెలిపింది. ఇక తాజాగా గోపి సుంద‌ర్ ఈ వివాదాల‌పై స్పందిస్తూ.. “విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది .. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను అని పేర్కొన్నారు. 2001లో గోపిసుంద‌ర్.. ప్రియని వివాహం చేసుకోగా,ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. 


logo