ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 17, 2021 , 21:10:33

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..

కరోనా కారణంగా అనుకున్న దానికంటే ఏడాది ఎక్కువగానే గ్యాప్ తీసుకున్నాడు మహేష్ బాబు. గతేడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చి విజయం అందుకున్న ఈయన.. నాలుగు నెలలు గ్యాప్ తీసుకుని సర్కారు వారి పాట మొదలు పెట్టాలనుకున్నాడు. కానీ మధ్యలో అనుకోకుండా కరోనా వచ్చింది.. దాంతోపాటే లాక్ డౌన్ కూడా వచ్చేసింది. దాంతో ఇంట్లోనే అంతా లాక్ అయిపోయారు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు సర్కారు వారి పాటకు ముహూర్తం పెడుతున్నాడు సూపర్ స్టార్. త్వరలోనే ఈయన దుబాయ్‌ వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. అక్కడే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రతిసారి ఏ మాత్రం హాలీడేస్ దొరికినా కూడా వెంటనే కుటుంబంతో పాటు ఫ్లైట్ ఎక్కి పరదేశాలకు వెళ్తుంటాడు సూపర్ స్టార్. కానీ ఈ సారి దుబాయ్ అలాంటి ట్రిప్ మాత్రం కాదు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు కుటుంబాన్ని కూడా తీసుకెళ్తూనే తన సినిమా పనులు కూడా పూర్తి చేయనున్నాడు. 

సర్కారు వారి పాట షూటింగ్‌ కోసమే దుబాయ్‌ వెళ్తున్నాడు మహేష్ బాబు. గీత గోవిందం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పరుశురామ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఓ షెడ్యూల్‌ను జనవరి చివర్లో దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నాడు పరశురామ్. అక్కడే 20 రోజులు ఉండబోతున్నాడు సూపర్ స్టార్. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తైపోయింది. ఆ తర్వాత అక్కడ్నుంచి వచ్చి హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. 

ఇక్కడే ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్‌లో పాట చిత్రీకరించనున్నాడు. ఈ సినిమాలో పూర్తిగా ఆర్థిక నేరాలను చూపించబోతున్నాడు పరశురామ్. భారత బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాడు పరశురామ్. ఇందులో ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో మహేష్ నటించబోతున్నాడని.. ఆయన తండ్రిపై పడిన నిందను ఎలా పోగొట్టాడు అనేది అసలు కథ అని తెలుస్తుంది

. వేలాది కోట్లు దోచేసిన ఓ ప్రముఖ బిజినెస్ మెన్‌కు బుద్ధి చెప్పి దొంగిలించిన డబ్బు ఎలా వెనక్కి తీసుకొచ్చాడనేది మిగిలిన కథ.ఈ సినిమాలో అనిల్ కపూర్ విలన్‌గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo