శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Aug 15, 2020 , 10:45:37

మ‌న రాత మ‌న‌మే రాసుకోవాలా.. గుడ్ ల‌ఖ్ స‌ఖి టీజ‌ర్

మ‌న రాత మ‌న‌మే రాసుకోవాలా.. గుడ్ ల‌ఖ్ స‌ఖి టీజ‌ర్

మ‌హాన‌టితో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వీటితో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రం గుడ్ ల‌ఖ్ స‌ఖి అనే చిత్రం చేస్తుంది.  ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్‌ రాజు పమర్పణలో సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. మూడు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన గుడ్‌లక్‌ సఖి చిత్ర టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది. ఇందులో కీర్తి లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి షూటర్‌గా నటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ టీజర్‌ని ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌ల చేయించారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మీరు టీజ‌ర్‌పై ఓ లుక్ వేయండి. ఇదిలా ఉంటే కీర్తి చివ‌రిగా పెంగ్విన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా థియేటర్‌లో కాకుండా..డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పరవాలేదని పించింది.  logo