గురువారం 01 అక్టోబర్ 2020
Cinema - Aug 13, 2020 , 23:44:06

పల్లెటూరి సఖి

పల్లెటూరి సఖి

కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌లక్‌ సఖి’. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న చిత్ర టీజర్‌ విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘క్రీడా నేపథ్య కథాంశంతో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. గ్రామీణ ప్రాంతానికి చెందిన షూటర్‌గా కీర్తిసురేష్‌ పాత్ర విభిన్నంగా ఉంటుంది.  మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాం. చిన్న షెడ్యూల్‌ మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: చిరంతన్‌దాస్‌, సహనిర్మాత: శ్రావ్యవర్మ. 


logo