వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. సిద్ధు, అల్లు బాబీ నిర్మాతలు. సయీ మంజ్రేకర్ కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ పునఃప్రారంభమైంది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ైక్లెమాక్స్తో పాటు భారీ పోరాటఘట్టాల్ని చిత్రీకరిస్తున్నాం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని తెలియజేస్తాం’ అన్నారు. ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, సంగీతం: తమన్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.