వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల

'ముకుంద' సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని న్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కెరీర్లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ రోజు వరుణ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ లుక్ మూవీపై ఆసక్తిని కలిగిస్తుంది. గని అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ప్రత్యేకంగా అమెరికాలో శిక్షణ పొందారు.
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్