సరైన కథలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ ఉరఫ్ వెంకటేష్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకు తెర వెనక కొన్ని సినిమాలకు పని చేసిన బాబీ.. తొలిసారి తన పేరు నిర్మాతగా చూసుకోబోతున్నాడు.
గని సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఈ సినిమా కోసం ఫిజికల్ గానూ చాలా మారిపోయాడు వరుణ్ తేజ్. కెరీర్ లో తొలిసారి పూర్తిగా తన హైట్ కు సరిపోయే పాత్ర చేస్తున్నాడు . కండలు పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు.ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేసినట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్ బాక్సింగ్ ఎపిసోడ్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. గని సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కులను కలిపి 24 కోట్లకు ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి సీనియర్ నటులు కనిపిస్తున్నారు.