గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 23, 2021 , 08:41:12

కాలిన‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు

కాలిన‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడు

బుల్లితెర క‌మ‌ల్ హాసన్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లుగాంచిన జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు గెట‌ప్ శ్రీను. స్కిట్స్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తాడు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ తో క‌లిసి ఈయ‌న చేసే కామెడీ ప్రేక్ష‌కుల పొట్ట చెక్క‌ల‌య్యేలా చేస్తుంది. ఇటు బుల్లితెర‌పై అల‌రిస్తూనే అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా న‌టిస్తున్న గెట‌ప్ శీను తాజాగా కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండ‌కి చేరుకున్నాడు. ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశాడు. అలానే తిరుమలలో మెట్లెక్కుతున్న ఫొటోను  కూడా షేర్ చేశాడు. ఈ ఫొటోల‌లో  రేడియో జాకీ, నటుడు హేమంత్ కూడా ఉన్నాడు.


VIDEOS

logo