మంగళవారం 07 జూలై 2020
Cinema - May 30, 2020 , 09:19:53

మ‌హేష్‌తో ముచ్చ‌టించే ఛాన్స్‌..!

మ‌హేష్‌తో ముచ్చ‌టించే ఛాన్స్‌..!

ఈ ఏడాది మొద‌ట్లో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి సినిమాని మొద‌లు పెట్ట‌లేదు. లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఆయ‌న అతి త్వ‌ర‌లోనే ప‌ర‌శురాంతో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. దీని త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో భారీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.

సినిమాలు లేక మ‌హేష్ ఫ్యాన్స్ నిరాశ‌లో ఉండ‌గా, వారిని ఆనందింప‌జేసేందుకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ముచ్చ‌టించేందుకు సిద్ద‌మ‌య్యాడు సూప‌ర్ స్టార్. మే 31 సాయంత్రం 5గం.ల‌కి మ‌హేష్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇవ్వ‌నున్నాడు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మ‌హేష్‌తో ముచ్చ‌టించే ఛాన్స్ మిస్ చేసుకోకండి. కాగా, మే 31 సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్‌-ప‌ర‌శురాం ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలుస్తుంది. 


logo