శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 16:31:46

మ‌ళ్లీ ఒక్కచోట చేరిన 'జార్జ్ కుట్టీ' ఫ్యామిలీ

మ‌ళ్లీ ఒక్కచోట చేరిన  'జార్జ్ కుట్టీ' ఫ్యామిలీ

మోహ‌న్ లాల్‌, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం దృశ్యం. ఈ సూప‌ర్ హిట్ చిత్రానికి సీక్వెల్ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. జార్జ్ కుట్టీ (మోహ‌న్ లాల్‌) ఫ్యామిలీని దృశ్యం 2 కోసం మ‌ళ్లీ ఒక్క‌చోట చేర్చాడు డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్. ఆరేళ్ల విరామం త‌ర్వాత మోహ‌న్ లాల్‌, మీనా, అన్సిబా, ఈస్త‌ర్లు సినిమా కోసం మ‌ళ్లీ ఒక్క‌చోట చేరిపోయారు. ఇన్ స్టాగ్రామ్ లో జార్జ్ కుట్టీ అండ్ ఫ్యామిలీ ఫొటోను జీతుజోసెఫ్ పోస్ట్ చేశాడు. ఆరేళ్ల విరామం త‌ర్వాత జార్జ్ కుట్టీ ఫ్యామిలీతో అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు జీతు జోసెఫ్. సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో ఒరిజిన‌ల్ వెర్ష‌న్ తెర‌కెక్కింది.

త‌న కూతురిని వేధిస్తున్న ఆక‌తాయిని  చంపిన త‌ర్వాత త‌ల్లి (మీనా) కుటుంబం ఎదుర్కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో సాగ‌నున్న ఈ చిత్రం సీక్వెల్ ను జీతు జోసెఫ్ ఏవిధంగా తెర‌పై ఆవిష్క‌స్తాడో చూడాలి. దృశ్యం సినిమా ను హిందీ అజ‌య్ దేవ్‌గ‌న్, శ్రియ కాంబినేష‌న్ లో రీమేక్ చేయ‌గా..తెలుగులో వెంక‌టేశ్-మీనా కాంబినేష‌న్ లో రీమేక్ చేశారు. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo