ఆదివారం 05 జూలై 2020
Cinema - May 16, 2020 , 08:47:32

రెడీ సంగ‌తులు గుర్తు చేసుకున్న జెనీలియా

రెడీ సంగ‌తులు గుర్తు చేసుకున్న జెనీలియా

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన జెనీలియా.. రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంటుంది. పిల్ల‌లు, కుటుంబంతో కాల‌క్షేపం చేస్తున్న జెనీలియా..మే 15న రామ్ బ‌ర్త్ డే కావడంతో త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెడీ సంగ‌తులు గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది.

‘డియర్ రామ్.. ఈ స్టిల్ రెడీ సినిమాలోనిది.. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే..మనం ఇంకా కొన్ని ఫోటోలు దిగాలి..హెహెహె.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు నవ్వులే కాకుండా ఎంతో మంచి వ్యక్తులను కలిశాము..అనుభవం ఉన్నవారిని కలిశాము..కానీ ఇప్పుడు అవ‌న్నీ లేవు. మ‌నం  ట‌చ్‌లో కూడా లేము. కాని అప్ప‌టి జ్ఞాప‌కాలు అలానే మిగిలి ఉన్నాయి. నా ఫ్రెండ్‌కి మంచి ఉదాహ‌ర‌ణ నువ్వే. మ‌నం రోజు ట‌చ్‌లో లేక‌పోయిన‌, నువ్వు ఏం చేస్తున్నా..మ‌నం ఎక్కడ ఆగామో అక్క‌డ మొద‌లు పెట్టొచ్చు. మీ ప్రేమ‌కి నా ధన్య‌వాదాలు అంటూ రెడీ సంగ‌తుల‌ని గుర్తు చేసుకుంది జెనీలియా. 


logo