శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 14:40:27

బిగ్ బాస్ హౌజ్‌లో జంబ‌ల‌కిడి పంబ‌..!

బిగ్ బాస్ హౌజ్‌లో జంబ‌ల‌కిడి పంబ‌..!

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన విజయవంతమైన హాస్యభరిత సినిమా జంబ‌ల‌కిడి పంబ. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి తెలియ‌జేస్తూ.. ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు. ఇప్పుడే ఇలాంటి క‌థే బిగ్ బాస్ హౌజ్‌లో జ‌రిగింది. నేటి రాత్రి ప్ర‌సారం కానున్న ఎపిసోడ్‌లో అమ్మాయిలు.. అబ్బాయిలుగా, అబ్బాయిలు.. అమ్మాయిలుగా కనిపించ‌నున్నారు. 

తాజాగా ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్‌లో అమ్మాయిల‌కి, అబ్బాయిల‌కి తేడా లేదు. ఇద్ద‌రు ఒక‌టే అని అన్నారు. ఇక అమ్మాయిల గెటప్స్‌లో అబ్బాయిలు వ‌య్యారాలు ప‌డుతుంటే నాగార్జున వారిని చూడ‌లేక‌పోయారు. మిమ్మ‌ల్ని ఇలా చూసాక నాకు రాత్రి ఎలాంటి క‌ల‌లు వ‌స్తాయో అంటూ చిరు న‌వ్వు న‌వ్వారు. అమ్మాయిలు కూడా అబ్బాయిల గెటప్స్‌లోకి మార‌గా, ప్యాంట్ ష‌ర్ట్ ధ‌రించిన గంగ‌వ్వ మాత్రం త‌న గెట‌ప్‌తో  అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకుంది. మొత్తానికి సండే ఎపిసోడ్ ఫుల్ ఫ‌న్‌డేగా మార‌నుంది. అయితే ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌజ్ నుండి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కాగా, మ‌రొక‌రు కూడా ఎలిమినేట్ అవుతార‌నే చర్చ న‌డుస్తుంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో!