ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 13:39:00

స్లిమ్‌గా కావాల‌నుకునే వారు బిగ్ బాస్‌కు వెళ్తే చాలు..

స్లిమ్‌గా కావాల‌నుకునే వారు బిగ్ బాస్‌కు వెళ్తే చాలు..

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బిగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాష‌లలో ప్ర‌సారం అవుతున్న ఈ కార్య‌క్ర‌మం తెలుగులో మూడు సీజ‌న్స్ పూర్తి చేస్తుంది. ప్ర‌స్తుతం నాగార్జున హోస్ట్‌గా నాలుగో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ షో భారీ టీఆర్పీతో దూసుకెళుతున్న‌ప్ప‌టికీ, కొన్ని విమ‌ర్శ‌ల‌ను మాత్రం మూట‌గ‌ట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారు బ‌య‌ట‌కు వ‌చ్చి చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ప్ర‌ముఖ సింగర్, బిగ్ బాస్ సీజ‌న్ 2 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన  గీతా మాధురి తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. 2 సంవ‌త్స‌రాల క్రితం ఫోటో ఇది. స్లిమ్‌గా కావాల‌నుకునే వారికి నా స‌ల‌హా ఒక్క‌టే.  బిగ్ బాస్ హౌజ్‌కు వెళితే స‌రిపోతుంద‌ని తెలిపింది.  గీతా మాధురి కామెంట్స్  ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, ఆమె ఏ యాంగిల్‌లో ఈ కామెంట్ చేసింద‌నే చ‌ర్చ న‌డుస్తుంది. 


logo