యాంకర్ ప్రదీప్ సినిమాకు గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యాకప్

యాంకర్ ప్రదీప్‌కు బుల్లితెరపై ఎంత పాపులారిటీ ఉందనేది ఆయన చేసే కార్యక్రమాలను బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రదీప్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా సత్తా చూపించాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరో కూడా అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైపోయింది.. విడుదలకు సిద్ధంగానే ఉంది. అప్పుడెప్పుడో ప్యాండమిక్కు ముందు గతేడాది మార్చ్ 25న ఉగాది కానుకగా సినిమాను విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేసారు. అన్నింటికి మించి ఈ సినిమాలోని పాట నీలి నీలి ఆకాశం దుమ్ము దులిపేసింది. ఒకే పాటతో సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోయింది. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లు పాట సూపర్ హిట్ అయినా కరోనాతో సినిమా విడుదల కాలేదు. దాంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు చడీచప్పుడు లేదు ఈ చిత్రం గురించి.
మరోవైపు ప్రదీప్ కూడా ఈ సినిమా గురించి ఆలోచించడం మానేసి.. వచ్చినపుడే వస్తుందిలే అని తన పని తాను చేసుకుంటున్నాడు. దాంతో దాదాపు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా గురించి ప్రేక్షకులు కూడా మరిచిపోయారు. అయితే ఇప్పుడు దీన్ని గుర్తు చేసే పనిలో పడుతున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. ప్రదీప్ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని చూసారు కానీ థియేటర్స్ ఓపెన్ కావడం.. మంచి వసూళ్లు వస్తుండటంతో బిగ్ స్క్రీన్ పైనే ఈ యాంకర్ సినిమా విడుదల అవుతుందిప్పుడు. ఇప్పటికే ఈ విషయంపై దర్శక నిర్మాతలు కూడా ముందడుగు వేసారు. అయితే ఈ సినిమాకు థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు గీతా, యూవీ క్రియేషన్స్ ముందుకొచ్చాయి.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను బ్యాకప్ చేస్తున్నాయి ఈ రెండు భారీ నిర్మాణ సంస్థలు. యాంకర్ ప్రదీప్ తో వాళ్లకున్న సాన్నిహిత్యం కారణంగా ఈ సినిమాను వాళ్లిద్దరూ విడుదల చేయబోతున్నారు. ఈ ఇద్దరు ప్రదీప్ సినిమా తీసుకున్నారు కాబట్టి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉన్నారు చిత్ర యూనిట్. ఎందుకంటే మంచి థియేటర్లు పడతాయి.. సినిమా బాగుంటే వసూళ్లు బాగానే వస్తాయి. అందుకే ప్రదీప్ అండ్ టీమ్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రదీప్‌కు జోడీగా అమృత అయ్యర్ నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను సుకుమార్ శిష్యుడు మున్నా తెరకెక్కించాడు. మరి ఈ చిత్రంతో ప్రదీప్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్‌గా 'పిట్టకథలు' టీజర్
కిస్ ఇవ్వలేదని.. ఆమె నన్ను వదిలేసి వెళ్లింది
రాశీఖన్నాకు నో చెప్పిన గోపీచంద్..!
మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైరల్
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
పాయల్ రాజ్‌పుత్.. ఈ ముద్దుల కహానీ ఏంటి?
నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ