మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 00:48:19

కిచెన్‌ డ్యూటీ షారుఖ్‌ తీసుకున్నారు

కిచెన్‌ డ్యూటీ షారుఖ్‌ తీసుకున్నారు

లాక్‌డౌన్‌ విరామంలో షారుఖ్‌ఖాన్‌ తన పిల్లల కోసం  గరిటె పట్టారు. వారికి ఇష్టమైన వంటకాలన్నీ చేసిపెట్టారు.        ఈ విషయాన్ని షారుఖ్‌ఖాన్‌ భార్య గౌరీఖాన్‌ స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘షారుఖ్‌ఖాన్‌కు వంట చేయడమంటే చాలా ఇష్టం. పాకశాస్త్రంలో తనకు చక్కటి ప్రావీణ్యముంది. ఇంతకుముందు షూటింగ్‌, నిర్మాణపరమైన పనులతో బిజీగా ఉండటంతో షారుఖ్‌కు కిచెన్‌లో అడుగుపెట్టే అవకాశం ఎప్పుడూ రాలేదు. మార్చిలో లాక్‌డౌన్‌ మొదలవ్వడంతో నటన, నిర్మాణ సంస్థ వ్యవహారాలన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. వైరస్‌ భయంతో బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేయడానికి భయమేసేది. దాంతో పిల్లలకు ఇష్టమైన వంటకాలన్నీ షారుఖ్‌ఖాన్‌ స్వయంగా సిద్ధంచేశారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో కిచెన్‌ డ్యూటీ మొత్తం ఆయనే చూసుకున్నారు. నాలుగు నెలలు నేను కిచెన్‌ వైపు వెళ్లలేదు’ అని తెలిపింది. logo