శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 08:58:47

కెప్టెన్ బాధ్య‌తలు అందుకున్న గంగ‌వ్వ‌

కెప్టెన్ బాధ్య‌తలు అందుకున్న గంగ‌వ్వ‌

ఉక్కు హృద‌యం టాస్క్‌తో వేడెక్కిన బిగ్ బాస్ హౌజ్ ప్ర‌స్తుతం శాంతంగా ఉంది. అన్నీ మ‌ర‌చిపోయి హౌజ్‌మేట్స్ అంద‌రు స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. శుక్ర‌వారం ఎపిసోడ్‌లో అంద‌రు  ‘నక్కిలీసు’ గొలుసు పాట‌కు త‌మ‌దైన స్టైల్‌లో చిందులేశారు.  ఆ త‌ర్వాత టాస్క్ గురించి గంగ‌వ్వ‌, దేవి, సుజాత చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా ఆ త‌ర్వాత‌ రాజ‌శేఖ‌ర్, దివిల మ‌ధ్య .. సోహైల్‌, మెహ‌బూబ్‌ల మ‌ధ్య కూడా డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. ఇంత‌లోనే బిగ్ బాస్ జైలు నుండి నోయ‌ల్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు బిగ్ బాస్. 

జైలు నుండి విడుద‌ల‌య్యే ముందు హౌజ్‌మేట్స్ అంద‌రు నోయ‌ల్‌తో క‌లిసి ప్లెడ్జ్ చేశారు. బిగ్ బాస్ మై డ్రీమ్.. ఆల్ ది కంటెస్టెంట్స్ ఆర్ మై బ్రదర్స్ సిస్టర్స్ అని పాడారు.  అభిజిత్ మాత్రం ప‌క్క‌నే ఉండి గ‌మ‌నిస్తూ ఉన్నారు. అనంత‌రం గంగ‌వ్వ.. ‘ఉక్కు హృదయం’ టాస్క్‌లో ఎవరు ఎలా బిహేవ్ చేశారో అనుక‌రించి అందర్నీ నవ్వించే ప్ర‌య‌త్నం చేసింది. గంగ‌వ్వ ప‌ర్‌ఫార్మెన్స్ కు హౌజ్‌మేట్స్ ఫిదా అయ్యారు.

ఇక ఉక్కు హృద‌యం టాస్క్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శించిన న‌లుగురు అంటే  గంగవ్వ, హారిక, అవినాష్, అభిజిత్‌లలో ఒక‌రికి కెప్టెన్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని బిగ్ బాస్ ముందుగానే ప్ర‌క‌టించారు. అయితే వీరి న‌లుగురిలో ఒక‌రికి మాత్ర‌మే కెప్టెన్ అయ్యే అవ‌కాశం ఉన్నందున  రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా న‌లుగురికి రంగు నీళ్ళ‌తో నిండిన బౌల్స్ ఇవ్వ‌గా, చివ‌రి వ‌ర‌కు ఎవ‌రు నీళ్లు కింద ప‌డ‌కుండా ఉంచుకుంటారో వారే విజేత‌ల‌ని ప్ర‌క‌టించారు. ఇంటి సభ్యులు అందరూ గంగవ్వను కెప్టెన్‌గా నిల‌బెట్టే క్ర‌మంలో  హారిక, అవినాష్, అభిజిత్‌ బౌల్స్‌లో ఉన్న రంగు నీళ్లను ప‌డేశారు.  దీంతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది.

అభిజిత్‌, మోనాల్ స‌ప‌రేట్‌గా కూర్చొని మాట్లాడుతున్న స‌మ‌యంలో మోనాల్‌..అభి నువ్వంటే నాకు ఇష్ట‌మ‌ని నోయ‌ల్‌కు చెప్పాన‌ని అంది. దీనికి అభి.. చెప్పాల్సిన‌వి నా ద‌గ్గ‌ర చెప్ప‌వు, వేరే వాళ్ళకు చెప్తావు అన్నాడు. ఆ త‌ర్వాత మోనాల్ ..అఖిల్ ద‌గ్గ‌ర‌కు వచ్చి అత‌నిని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఈ విష‌యాల గురించి రాజ‌శేఖ‌ర్, గంగ‌వ్వ‌, అభిజిత్ ముచ్చటించుకున్నారు.  

ఇక మొద‌టి నుండి బిగ్ బాస్ ఎంత హెచ్చ‌రిస్తున్నా కూడా ఆదేశాలు పాటించ‌కుండా త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా హౌజ్‌మేట్స్ ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంటి స‌భ్యులకు పెద్ద ప‌నిష్మెంటే ఇచ్చారు.  ఈవారం ఇంటి సభ్యులు అన్ని టాస్క్‌‌లలో ఉత్తమ ప్రదర్శన కనపరిచినప్పటికీ లగ్జరీ బడ్జెట్ పాయింట్‌లను రద్దు చేయడంతో పాటు.. రేషన్‌లో కోత విధించారు. ఇలా మ‌రోసారి రిపీట్ చేస్తే ప‌నిష్మెంట్ మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని చెప్పారు. అయితే ఇదొక్క‌సారి క్ష‌మించ‌మ‌ని హౌజ్‌మేట్స్ వేడుకున్న‌ప్ప‌టికీ, బిగ్ బాస్ క‌నిక‌రించ‌లేదు. 


logo