గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 15:53:04

గంగ‌వ్వ కామెడీకి గొల్లున‌ న‌వ్విన తోటి కంటెస్టెంట్స్

గంగ‌వ్వ కామెడీకి గొల్లున‌ న‌వ్విన తోటి కంటెస్టెంట్స్

యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ  బిగ్ బాస్ ఎంట్రీ ఓ వండ‌ర్ అని చెప్పవ‌చ్చు. నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్టు 60 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ ముస‌లి వ్య‌క్తిని తొలిసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకు వ‌చ్చారు. ఈమె ఎంట్రీ అంద‌రికి షాకింగ్‌గా అనిపించింది. టాస్క్‌లు ఎలా ఆడుతుంది, పెద్ద‌గా చ‌దువుకోని గంగ‌వ్వ మిగ‌తా విష‌యాలు ఎలా అర్ధం చేసుకుంటుంది, అంద‌రితో ఎప్పుడు  క‌లివిడిగా తిరిగే ఆమె హౌజ్‌లో ఎలా ఉంటుంద‌నే అనుమానాలు ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదిలాయి.

గంగ‌వ్వ మొదటి వారంలోనే ఎలిమినేట్ కావ‌డం ప‌క్కా అని కొంద‌రు భావించారు. కాని వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ గంగ‌వ్వ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. షో ప్రారంభం అయిన రోజు నుండే గంగ‌వ్వ పేరుతో హ్యాష్ ట్యాగ్‌లు విప‌రీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె పేరుతో ఆర్మీలు త‌యార‌వుతున్నాయి. మీకు స‌పోర్ట్ గా మేమున్నాం అంటూ భారీ మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. సామాన్యులు, సెల‌బ్రిటిలే కాదు రాజ‌కీయ నాయ‌కులు కూడా గంగవ్వ  మద్దతుగా ఉంటామంటూ భ‌రోసా ఇస్తున్నారు. 

చొప్పదండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గంగవ్వకు ప్ర‌త్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మా చొప్పదండి నియోజకవర్గ అవ్వ గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు.మారుమూల పల్లె నుండి తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది.గంగవ్వ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ సంద‌డి ఎలా ఉంటుంద‌నేది నేటి నుండి తెలియ‌రానుంది. తాజాగా ఈ రోజు ప్ర‌సారం కానున్న కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా నామినేట్ చేయ‌వ‌ల‌సిన వారిపై కిటికీలు వేయాల‌ని బిగ్ బాస్ తెలిపారు. ఆ ప్ర‌క్రియ‌ను అమ్మ రాజ‌శేఖ‌ర్, సూర్య కిర‌ణ్‌, కరాటే క‌ళ్యాణి పూర్తి చేశారు. గంగ‌వ్వ వంతు వ‌చ్చే స‌రికి ఆమె ఎదురుగా దేత్త‌డి హారిక‌, అభిజిత్ ఉన్నారు. వారిలో ఎవరిని నామినేట్ చేస్తావు అంటే ..ఎవ్వరెందుకు.. మొన్ననే అచ్చిర్రు ఉండనీ అంటూ ఎంతో అమాయ‌కంగా చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ప‌క్క‌న ఉన్న సుజాత‌, లాస్య గొల్లున న‌వ్వారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.  logo