మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 08:43:22

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న గంగ‌వ్వ‌

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న గంగ‌వ్వ‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో పాల్గొన్న 16మంది కంటెస్టెంట్స్‌లో గంగ‌వ్వ ఒక‌రు. . మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన గంగ‌వ్వ తెలంగాణ యాస‌లో ఎంత‌టి వారినైన దుమ్ము దులు‌పుతుంది. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్‌ని కూడా ఇంట‌ర్వ్యూలు చేసి ఎంట‌ర్‌టైన్ చేసింది. నేష‌న‌ల్ మీడియా దృష్టిని కూడా ఆక‌ర్షించిన గంగ‌వ్వ ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మార‌నుంది.

60 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న కంటెస్టెంట్ గంగ‌వ్వ తొలిసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఆమెకు నెటిజ‌న్స్ నుండి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిగ‌తా 15 మంది కన్నా కూడా గంగ‌వ్వ‌నే ఎక్కువ మంది స‌పోర్ట్ చేస్తున్నారు. #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ గంగవ్వ ఆర్మీ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఇష్టం లేని వాళ్ళు కూడా గంగ‌వ్వ‌కు స‌పోర్ట్ ఇస్తున్నారు. మ‌రి గంగ‌వ్వ ఈ సారి బిగ్ బాస్ 4 టైటిల్ విన్న‌ర్ అయిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అంటున్నారు కొంద‌రు నెటిజ‌న్స్ 


logo