బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 11:17:42

నాలుక మ‌డ‌తెట్టి రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన గంగ‌వ్వ‌

నాలుక మ‌డ‌తెట్టి రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన గంగ‌వ్వ‌

శ‌నివారం రోజు హౌజ్‌మేట్స్ అంద‌రికి ఫుల్ క్లాస్ పీకిన నాగార్జున.. ఆదివారం రోజు సండే ఫన్ డే అంటూ వారంద‌రితో స‌ర‌దా గేమ్ ఆడించారు. డాగ్ అండ్ బోన్ గేమ్.. అనే పేరుతో మొద‌లైన ఆట‌లో ఇద్ద‌రు కంటెస్టెంట్స్ బోన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మ్యూజిక్ ఆగిపోయిన త‌ర్వాత ఎవ‌రైతే బోన్‌ని చేజిక్కించుకుంటారో వారు విజేత‌గా నిలుస్తారు అని పేర్కొన్నారు నాగార్జున‌. ఓడిపోయిన వారికి చిన్న‌పాటి శిక్ష కూడా ఇచ్చార‌నుకోండి.

డాగ్ అండ్ బోన్ గేమ్‌లో  ముందుగా అఖిల్ - అభిజిత్ రాగా, ఇందులో అఖిల్ గెలిచాడు. ఓడిన అభిజిత్‌ను పుష‌ప్స్ చేసే ప‌నిష్మెంట్ ఇచ్చారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ దేత్తడి హారిక - మోనాల్  జంట‌లో మోనాల్ గెలవ‌గా, ఓడిన‌ హారికకు పెదవులు క‌ల‌వ‌కుండా మాట్లాడాలి అని పనిష్మెంట్ ఇచ్చారు. దీనిని కొంత వ‌ర‌కు బాగానే ట్రై చేసింది హారిక‌. ఇక మూడో జంట‌గా  సోహైల్ - మెహబూబ్ రాగా, వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తికర పోటీలో మెహబూబ్ గెలిచాడు.  ఓడిన సోహైల్ పచ్చి ఉల్లిపాయ తిన్నారు

నాలుగో జంట‌గా వ‌చ్చిన  దేవి - రాజశేఖర్ ల మ‌ధ్య కూడా గ‌ట్టి పోటీనే జ‌ర‌గ‌గా, ఇందులో దేవి గెలిచింది. నిజానికి రాజశేఖర్ వదిలేశారు. దీనికి పనిష్మెంట్ కింద రాజశేఖర్‌తో మిరపకాయ తినిపించారు. ఐదో జంట‌గా వ‌చ్చిన  సుజాత - లాస్యల‌లో సుజాత గెలిచింది. ఓడిన‌ లాస్యకు చిన్న పిల్లలా నటించే పనిష్మెంట్ ఇచ్చారు. ఆరో జంటగా  దివి - అరియానా రాగా, వీరిలో దివి గెలిచింది. ఓడిన‌ అరియానాకు పోల్ డ్యాన్స్ చేసే పనిష్మెంట్ ఇచ్చారు.  

ఈ సారి కుమార్ సాయి- గంగ‌వ్వ ఓ జంట‌గా రాగా, వారికి ‘పైసా వసూల్’ సినిమాలోని టైటిల్ సాంగ్ ప్లే చేశారు. ఈ సాంగ్‌కు గంగ‌వ్వ నాలుక మ‌డ‌తెట్టి ఎంతో హుషారుతో డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ ను హౌజ్‌మేట్స్‌తో పాటు నాగార్జున కూడా తెగ ఎంజాయ్ చేశారు. చివ‌రలో  బోన్ అందుకుని కుమార్ సాయిని పరుగులు పెట్టించడం అక్క‌డ అంద‌రికి న‌వ్వులు పంచాయి.  చివ‌రి జంట‌గా వ‌చ్చిన‌ అవినాష్ - నోయల్‌లో అవినాష్ గెలవ‌గా, ఆయ‌న క‌ళ్ళు మూసుకొని నోయ‌ల్‌కు లిప్‌స్టిక్ వేశాడు. దీంతో సంద‌డిగా సాగిన గేమ్ స‌ర‌దాగా ముగిసింది. 


logo