సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 14:27:37

స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!

స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్'  హీరోయిన్..!

నాని హీరోగా న‌టించిన గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది చెన్నై బ్యూటీ ప్రియాంకా ఆరుళ్ మోహ‌న్‌. 2019లో వ‌చ్చిన ఈ చిత్రంలో న‌ట‌నా ప‌రంగా ప్రియాంకకు మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ భామ ప్ర‌స్తుతం శర్వానంద్ తో క‌లిసి శ్రీకారం సినిమాలో న‌టిస్తోంది. త్వ‌ర‌లో శివకార్తికేయ‌న్‌తో డాక్ట‌ర్ సినిమాతో త‌మిళంలో కూడా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఈ భామ తక్కువ టైంలోనే స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం కొట్టేసిన‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

స్టార్ హీరో సూర్య 40వ చిత్రంలో ప్రియాంక హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ అందుకున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. రూర‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రానున్న ఈ ప్రాజెక్టులో ప్రియాంక గ్రామీణ యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ట‌. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు పాండిరాజ్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo