‘సింధూర పువ్వు’ రాంఖీ, హర్షిత్‌రెడ్డి, వికాస్ వశిష్ట, రాఖీ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘గగనవీధిలో’. అమర్నాథ్ రెడ్డి గుంటక దర్శకుడు. ఆర్.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించడంతో పాటు టైటిల్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో నేటి యువత మెచ్చే అంశాలతో పాటు వారికి చక్కని సందేశం కూడా వుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఐ.రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల.