జబర్ధస్త్ అనే కార్యక్రమంతో ఎందరో నటులు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. కొందరు కమెడీయన్స్‌గా రాణిస్తుంటే మరి కొందరు ప్రధాన పాత్రలలో సినిమాలు చేస్తున్నారు. జబర్ధస్త్ షోతో సుడిగాలి సుధీర్‌గా పాపులర్ అయిన సుధీర్ కొద్ది రోజుల క్రితం సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు సుధీర్-రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మరోసారి ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమవుతున్నారు.
గాలోడు అనే టైటిల్‌తో సుధీర్ తన తాజా చిత్రం చేయనుండగా, కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో సుధీర్ నోట్లో సిగరెట్‌తో చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా చక్కని కథాంశంతో రూపొందుతుందని, ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుందని మేకర్స్ అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
దేశంలో 32 కోట్లు దాటిన కరోనా పరీక్షలు: ICMR
పామును పట్టుకుని.. లుంగీలో వేసుకుని..!
గుండె నొప్పి వస్తే తొలి గంటే కీలకం..!