గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 09:05:36

మాస్ట‌ర్‌ను బురిడీ కొట్టించిన అవినాష్‌.. ఊచ‌లు లెక్కెట్టిన నోయ‌ల్

మాస్ట‌ర్‌ను బురిడీ కొట్టించిన అవినాష్‌.. ఊచ‌లు లెక్కెట్టిన నోయ‌ల్

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ‘ఉక్కు హృదయం ’ అనే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి స‌భ్యుల మ‌ధ్య కొట్లాట‌లు, పోట్లాడ‌డం వంటివి జ‌రిగాయి. గురువారం ఈ టాస్క్ ముగియ‌గా, రోబోల టీంని విజేత‌గా ప్ర‌క‌టించారు బిగ్ బాస్. అలానే మ‌నుషులు టీం కూడా గ‌ట్టి పోటీ ఇచ్చిన నేప‌థ్యంలో వారిని అభినందించారు. 

గురువారం ఎపిసోడ్‌లో కొంత ఫ‌న్‌తో పాటు ఫ్ర‌స్ట్రేష‌న్స్ కూడా క‌నిపించాయి. ఆరుబ‌య‌ట కూర్చున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌గ్గ‌ర‌కు వచ్చిన అవినాష్ మెల్ల‌గా ఆయ‌న‌ను మాట‌ల‌లోకి దించి చార్జింగ్ పెట్టేసుకున్నాడు. దివి గ‌మ‌నించి ఈ విష‌యం చెప్పే స‌రికి రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ చాలా హ‌ర్ట్ అయ్యాడు. న‌మ్మ‌క ద్రోహం చేశావ్ అవినాష్‌. నీ వ‌ల‌న జీవితంలో ఎవ‌రిని న‌మ్మ‌ను అంటూ అనేక శాప‌నార్ధాలు పెట్టాడు అమ్మ‌. 

ఇక కొద్ది సేప‌టి త‌ర్వాత వాష్ రూంకి వెళ్ల‌డం కోసం సుజాత రోబోల టీంకు చార్జింగ్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. దీనిపై కొంత సేపు ర‌చ్చ జ‌రిగింది. ఇక ఆ త‌ర్వాత మోనాల్‌పై విశ్వ‌రూపం చూపించింది గంగ‌వ్వ‌. ఆమె వ‌స్తువులు లాక్కోవ‌డంతో శివాలెత్తిన గంగ‌వ్వ చైర్ విసిరేసి మ‌రీ ఫైర్ అయింది.  తనకు చార్జింగ్ ఇస్తే తినడానికి తిండి, నీళ్లు పెడతానని చెప్పివారికి భోజనం పెట్టి తాను చార్జింగ్ తీసుకుంది. 

మొత్తానికి టాస్క్‌లో దేవి ముందుగానే చ‌నిపోగా, దివి నుండి చార్జింగ్ తీసుకోవ‌డంతో ఆమె చ‌నిపోయింది. ఇక అరియానా,కుమార్ సాయి, లాస్య‌లు మ‌నుషుల దగ్గ‌ర నుండి చార్జింగ్ తీసుకోవ‌డంలో విఫ‌లం కావ‌డంతో వారు చ‌నిపోయారు.  రోబో టీంలో అభిజిత్, గంగవ్వల బ్యాటరీల చార్జింగ్‌లు ఇంకా అలాగే ఉండటంతో రోబో టీంను విజేతలుగా ప్ర‌క‌టించారు. దీంతో వారి ఆనందం అవ‌ధులు దాటింది. 

టాస్క్ ముగిసిన త‌ర్వాత కొద్ది సేపు దానిపై చ‌ర్చ జ‌రిగింది. బిగ్ బాస్ ఇంటి స‌భ్యులంద‌రిని లివింగ్ ఏరియాలోకి పిలిపించి  ఎవరి ప‌ర్‌ఫార్మెన్స్ బాగుంది, ఎవ‌రిది వ‌ర‌స్ట్‌గా ఉంద‌ని ప్ర‌శ్నించారు. ఇందుకు  గంగవ్వ, అభిజిత్, హారిక, అవినాష్‌లు నలుగురూ బాగా ప‌ర్‌ఫార్మ్ చేసార‌ని చెప్పారు. దీంతో వారిలో ఒకరు కెప్టెన్‌గా ఉండబోతున్నారని తెలిపారు బిగ్ బాస్.ఇక వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా ఇంటి  సభ్యులందరూ ఏకాభిప్రాయంతో నోయల్ పేరు చెప్పడంతో జైలు శిక్ష వేశారు బిగ్ బాస్.

ఖైదీ డ్రెస్ ధ‌రించిన నోయ‌ల్ డైరెక్ట్‌గా జైలులోకి వెళ్లారు. అత‌నికి ఫుడ్ అందించ‌కూడద‌ని బిగ్ బాస్ ఆదేశించారు. కేవ‌లం  రాగిజావ, ఏదో ఒక పండు మాత్రమే ఇవ్వాలని  అన్నారు. రాగిజావకు సంబంధించిన పిండిని నోయ‌లే చేసుకోవాల‌ని బిగ్ బాస్ పేర్కొన్నారు.  అయితే జైల్లో ఉన్న నోయ‌ల్ కాసేపు త‌న పాట‌తో అల‌రించారు. బంధీని కాదు నేను.. సంధించి వస్తాను.. చెరసాలలో వేసినా చరిత్ర రాస్తాను అంటూ జోష్‌గా పాడారు. అంత‌లోనే బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఓ భామ ప్ర‌వేశించింది. ఆమె ఎవ‌ర‌నేది నేడు తెలియ‌నుంది.  


logo